Sunday 4 September 2016

Omkaram 5th September, 2016 Yogam Kshemam Details For World

5th September Omkaram Yogam Kshemam in Telugu text, Omkaram 5th , September 2016, Omkaram Yogamkshemam today episode on online, omkaram yogam Kshemam Ganesh Chaturthi details on online. Get today’s online omkaram Vinayaka chavithi  special pooja information. Download Omkaram 5th September 2016 Undralla taddhi fine points. Yogam Kshemam for 5-09-2016. Omkaram devotional show on online. Omkaram 668 part live. Monday 5th September, 2016 Omkaram yoga Kshemam is calculated as one of the paramount show on online. 





పూజ విధానం:-
ఈ రోజు సాయంత్రం మీ ఇంట్లో గణపతి ఫోటో లేదా విగ్రహం ముందు 5 నేతిదీపాలు వెలిగించి, 5 రకాల పూలతో, 5 రకాల పత్రి తో పూజించి, 5 రకాల నైవేద్యాలను సమర్పించి, 5 సార్లు గణపతి ఋణ విమోచన స్తోత్రాన్ని చదవాలి. ఆ తరువాత హారతి ఇవ్వాలి. ఆ ప్రసాదాన్ని ఇంట్లోనివారందరూ పంచుకుని తినినట్లయితే ఈ సవత్సరం అంతా  ఆర్థిక బాధలు, ఋణ బాధలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉన్నవి కూడా తీరుతాయి.
   
సంకల్పం :- ఆర్థిక బాధలు, ఋణ బాధలు తీరాలని సంకల్పం చేసుకోవాలి.

ఈ రోజు వినాయక చవితి కారణంగా మీ పిల్లలకు విద్యభ్యాసం మంచిగా సాగడానికి మరొక పూజ. అయితే ఈ రోజు పూజ మొదలుపెట్టి శుక్రవారం వరకు రోజు చేయాలి.

ఈ రోజు సాయంత్రం మీ ఇంట్లోనే 1 తమలపాకుమీద మీ పిల్లలపేరు గంధంతో కానీ సిన్దురంతో కానీ వ్రాసి, దానిపై రాగి లేదా ఇత్తడి చెంబు పెట్టి ఆ చెంబుని సగం నీళ్ళతో నింపి అందులో పసుపు, కుంకుమ , అక్షతలు వేసి చుట్టూ మామిడి ఆకులు పెట్టి దానిపై 1 కొబ్బరికాయకి  బొట్టుపెట్టి పెట్టండి ఆ తరువాత ఆ కలసంలోకి గణపతిని ఆవాహం చేయించి నేతిదీపాలు వెలిగించి, మీ శక్తి కొలది పూజించి, నైవేద్యాలు పెట్టి , 21  గరికతో “ఓం గం గణపతే నమః “ అన్న  మంత్రోచ్చాట నతో  పూజ చేయాలి.  పూజానంతరం హారతి ఇవ్వాలి. అయితే రోజుట్టి
రోజు శుక్రవారం వరకు  అక్కడ దీపం పెట్టిపూజ చేయాలి.



గణపతికి మనసర్పించి పూజ చేసినట్లయితే విఘ్న రాజయినటువంటి విఘ్నేశ్వరుడు మీ పిల్లలకు విద్యాభాయసంలో ఎదురయ్యే అడ్డంకుల్ని తొలగించి మంచివిద్యభ్యాసాన్ని ప్రసాదిస్తాడు.




పార్థివ ప్రతిమా ప్రాశస్త్యము:
వినాయకుని ప్రతిమ మట్టిదే వాడవలెనా? ఏ రంగుది వాడవలెను? ఇవి అనేకుల ప్రశ్నలు. దీనికి గణేశ పురాణంలో సమాధానం కలదు.
శ్లో: పార్థివీ పూజితామూర్తి:స్థ్రియావా పురుషేణవా ఏకాదదాతి సా కామ్యం ధన పుత్రి పశూనపి
పురుషుడు గాని, స్త్రీ గాని మట్టితో చేసినగణపతి ప్రతిమను పూజ చేసినచో ధన,పుత్ర, పశ్వాది సమస్త సంపదలను పొందగలరు.
ఆ ప్రతిమ ఎటువంటి మట్టి తో చేయవలెను?
మృత్తికాం సుందరాం స్నిగ్ధాం క్షుద్ర పాషాణ వర్జితాం

శుభ్రం అయినది. మెత్తనిది, రాళ్ళు, ఇతర మాలిన్యములు లేనిది అగు మట్టిని స్వచ్చం అయిన నీటితో తడిపి  ప్రతిమచేయవలెను.

శ్లో. కృత్వా చారుతరాం మూర్తిం ణేశస్య శుభాం స్వయం సర్వావయవ సంపూర్ణాం చతుర్భుజ విరాజితాం

నాలుగు చేతులు గల వినాయక ప్రతిమను స్వయముగ చేసుకొనవలెను. అయితే ఇది అందరికి సాధ్యం కానిది. ప్రతి పట్టణములోను అప్పటికప్పుడు మట్టిని అచ్చులో వేసి ప్రతిమను చేసి ఇచ్చు అంగళ్ళు వినాయకచవితి ముందురోజునుండే పెడుతున్నారు. అట్టి ప్రతిమ అన్నిటికన్న మంచిదని గణేశ పురాణమును బట్టి గ్రహించవలెను.

దూర్వాయుగ్మ పూజ:

వినాయకునికి అత్యంత ప్రీతికరమైనవి దూర్వలు. దూర్వలు అనగా గరిక పోచలు.  గరిక అనగా గడ్డి ప్రతిచోట ఉండును.  చిగురులు కల గరికపోచలు వినాయకుని పూజలో వజ్రాల కన్న, బంగారు పూవులు కన్న ఎక్కువ విలువ అయినవి.  గణేశుడే స్వయంగామత్పూజా భక్తినిర్మితా మహతీ స్వల్పికావాపి వృధా దూర్వ్వంకురై ర్వినాఅంటే నాకు భక్తితో చేసినపూజ గొప్పది అయినను, చిన్నది అయినను దూర్వాంకురములు లేకుండా చేసినచో అది వృధా కాగలదు.

వినా దూర్వాంకు రై: పూజా ఫలంకేనాపి నాప్యతే

తస్మాదుషసి మద్భ  త్కై రేకా వాప్యేక వింశతి:

భక్త్యా సమర్పితా దూర్వా దదాతి యత్ఫలం మహత్

నతత్క్ర్ తుశతై  ర్దా నైర్వ తానుష్టాన సంచయై :“

 దూర్వాంకురములు లేని పూజ వలన ఫలమేమియు కలుగదు.  అందుచే నాకు భక్తులగువారు ఉష:కాలమందు ఒకటి గాని, ఇరువది ఒకటి గాని దూర్వలచే పూజింవచినచో కలుగు ఫలితము వంద యజ్ఞములవలన గాని, దానముల వలన గాని, వ్రతముల వలన గాని, తపముల వలన గాని పొందుట సాధ్యము కాదు. దూర్వాయుగ్మమం”  అంటే రెండేసి గరికపోచలు సమర్పించవలెను. ఒకటి ఒకటి విడదీయరాదు. శుభములు కలిగించునది, పుణ్యమును చేకూర్ఛునది అయిన కార్యములు  చేయునపుడు ఆటకములు లేకుండ ఆ కార్యము జరుగుటకు గణాధిపతిని ముందుగ పూజించవలెను.

వినాయకచవితి రోజున చేయు వినాయకవ్రతము ప్రముఖ శుభకార్యం కనుక ముందు పసుపుతో చేసిన గణపతిని పూజించవలెను.  పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకులో ఉంచవలెను.  చిన్నపళ్ళెములో బియ్యం పోసి ఆ బియ్యముపై పసుపుతో చేసిన గణపతిని తమలపాకుతో సహా ఉంచవలెను. ఆకు కొన తూర్పునకు ఉండవలెను.  ఆవు నేతితో గాని, నూనెతో గాని దీపము వెలిగించి, గణపతికి నమస్కరించి ఈ విధముగా చదువ వలెను.

శ్రీ మహాగణాధిపతయే నమ: శ్రీ గురుభ్యోనమ: హరి: ఓం

శ్లో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం   ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.

 మం.  ఓం  దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి సామోమంద్రేషమూర్జంయహానా ధేనుర్వాగస్మానం పసుష్టుతైతు

 అయం ముహూర్త స్సుముహూర్తో అస్తు.

ఆచమనం:
 
 
పాత్ర(అనగా చిన్న చెంబు లేక గ్లాసు) తో నీరు తీసుకొని ఉద్ధరిణి లేదా చెంచాతో ఆచమనం చేయవలెను.  బొటనవ్రేలి చివరను మధ్యవ్రేలి మధ్యకణుపునకు చేర్చి అరచేతిలో మినపగింజ మునిగేటంత నీటిని పోసుకుని ఆచమనం చేయవలెను.
ఓం కేశవాయ స్వాహా:  
 ఓం నారాయణాయ స్వాహా:  
 ఓం మాధవాయ స్వాహా :
 ( మూడు నామములు చెప్పుచూ కుడి చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను.)
ఓం గోవిందాయ నమ: (చేతిని కడుగ వలెను.)
ఓం  విష్ణవే నమ: ఓం త్రివిక్రమాయ నమ:  ఓం వామనాయ నమ: ఓం శ్రీధరాయ నమ: ఓం హ్రుషీకేశవాయ నమ: ఓం పద్మనాభాయ నమ: ఓం దామోదరాయ నమ:
ఓం సంకర్షణాయ నమ: ఓం వాసుదేవయ నమ: ఓం ప్రద్యుమ్నాయ నమ: ఓం పురుషోత్తమాయ నమ: ఓం అధోక్షోజాయ నమ: ఓం అచ్యుతాయ నమ: ఓం జనార్థనాయ నమ: ఓం హరయే నమ: ఓం శ్రీ కృష్ణాయ నమ:
దైవ ప్రార్థన:
 (గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను.
శ్లో:  
యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
భస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థో జనార్థన:
 ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.
 శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ:  ఉమా మహేశ్వరాభ్యాం నమ: శచీ పురంధరాయ నమ: అరుంధతీ వశిష్టాభ్యాం నమ: శ్రీ సీతారామాభ్యాం నమ: సర్వేభ్యో మహాజనేభ్యో నమ:
భూతోచ్చాటన: (క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)
శ్లో:  ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే
తా: భూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట.  చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము.
ప్రాణాయామము: ఓం భూ:  ఓం భువ:  ఓం సువ:  ఓం మహ:  ఓం జన:  ఓం తప:  ఓం సత్యం  ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవశ్యధీమహి ధియోయోన: ప్రచోదయాత్  ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం
(గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి  భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను.  దీనినే పూరకం, కుంభకం, రేచకం అందురు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అందురు.  బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.) 
సంకల్పము:
(ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమి కోరి,ఏ పని చేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అందురు.) 

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే,కలియుగే, ప్రధమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షఋతౌ, భాద్రపదమాసే,శుక్లపక్షే, చతుర్థ్యాం ………………. వాసరే,శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. 
(నీరు ముట్టుకొనవలెను.)
కలశారాధనం: (కలశం అనగా పూజ చేయుటకు నీరు తీసుకున్న పాత్ర. ఆచమనము చేయుటకు పెట్టుకున్న నీటిపాత్రను కలశారాధనకు వాడరాదు.వేరేపాత్రలో నీటిని పోసి ఆ పాత్రచుట్టూ మూడుచోట్ల గంధము, కుంకుమ, అక్షతలు అద్ది ఆనీటిలో గంధమును, పుష్పములను, అక్షతలను ఉంచితే అదే కలశము. దానిపై చేతిని ఉంచి ఈ క్రింది విధముగా చదువవలెను.
శ్లో: కలశస్య ముఖే విష్ణు: కంటే రుద్ర స్సమాశ్రిత: మూలే తత్ర స్థితోబ్రహ్మ మధ్యే మాతృ గణాస్మృతా:
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేదోధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణ:
అంగై శ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితా: కలశే గంధ పుష్పాక్షతాన్ నిక్షిప్యహస్తే నాచ్చాద్య.
మం: ఆదల శేషుధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్ధైర్యజ్ణేషు వర్ధతే, ఆపోవా ఇదగ్ం సర్వం విశ్వాభూతా న్యాప: ప్రాణావా ఆప: పశవ ఆపోన్నమాపోమృతమాపస్సమ్రాడాపోవిరాడాపస్స్వరాడాపశ్చందాగ్ స్యాపో జ్యోతీగ్ ష్యాపో యజూగ్ ష్యాప స్సత్యమాపస్సర్వా  దేవతా ఆపో భూర్భువస్సువరాప ఓం.
గంగేచ యమునేకృష్ణె గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్ధం మమ దురితక్షయకారకా: కలశోదకేన దేవం, ఆత్మానం, పూజా ద్రవ్యాణి చ సంప్రోక్ష్య. (కలశములోని నీరు పుష్పముతో గణపతి పైన, పూజాద్రవ్యములపైన చల్లవలెను.
గణపతి పూజ
ప్రాణ ప్రతిష్ట
(పుష్పముతో పసుపు గణపతిని తాకుతూ ఈ క్రింది విధముగా చదువ వలెను.
 ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవింకవీనాం ఉపవశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్నణస్పత ఆనశృణ్వమన్ న్నోతిభి స్సీదసాధనం
 అసునీతే పునరస్మాను చక్షు: పున: ప్రాణమినహనోదేహి భోగం
జ్యోక్పశ్యేమసూర్యముచ్చరంతమనుమతే మృళయాద స్స్వస్తి
అమృతంవై ప్రాణామృతమాప:ప్రాణానేవయధాస్థానముపహ్వ్యయతే.
 శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నిపుత్ర పరివార సమేతం శ్రీమహాగణాధిపతిం ఆవాహయామిస్థాపయామి పూజయామి స్థిరో భవ, వరదోభవ, సుప్రసన్నోభవ, స్థిరాసనం కురు. గణపతి ప్రాణప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తో అస్తు.
షోడశోపచార పూజ:
(క్రింది విధముగా ఒక్కొక్క ఉపచారము చెప్పి గణపతికి అక్షతలు సమర్పించవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమ: ధ్యానం సమర్పయామి,  ఆవాహయామి,  రత్నసింహాసనం సమర్పయామి,  
(క్రింది విధముగ చదువుతు కలశములోని నీరు పుష్పముతో గణపతిపై చల్లవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమ: పాదయో పాద్యం సమర్పయామి,  హస్తయో అర్ఘ్యం సమర్పయామి,  ముఖే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం  సమర్పయామి  స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.  అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వారత్మక: శ్రీ  మహాగణాధిపతయో నమ: వస్త్రయుగ్మం సమర్పయామి  శ్రీ మహాగణాధిపతయే నమ: యజ్ణోపవీతం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమ: దివ్యశ్రీ చందనం సమర్పయామి  శ్రీ మహాగణాధిపతయే నమ: అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి
(ఏ క్రింది నామములు చదువుతూ గణపతికి పుష్పములు గాని, అక్షతలు గాని భక్తితో సమర్పింవవలెను.)
ఓం సుముఖాయ నమ:  ఓం ఏకదంతాయ నమ:  ఓం కపిలాయ నమ:  ఓం గజకర్ణాయ నమ:  ఓం లంబోదరాయ నమ:  ఓం వికటాయ నమ: ఓం విఘ్నరాజాయ నమ:  ఓం గణాధిపతయే నమ:  ఓం ధూమకేతవే నమ: ఓం గణాధ్యక్షాయ నమ:  ఓం పాలచంద్రాయ నమ:  ఓం గజాననాయ నమ:
ఓం వక్రతుండాయ నమ:  ఓం శూర్పకర్ణాయ నమ:  ఓం హేరంబాయ నమ:  ఓం స్కందపూర్వజాయ నమ:  ఓం సర్వసిద్ధి ప్రదాయ నమ: ఓం మహాగణాధిపతయే నమ: షోడశ నామభి: పూజాం సమర్పయామి.
(అగరవత్తులు వెలిగించి ధూపమును చూపించవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమ: ధూపమాఘ్రాపయామి.
(దీపమునకు నమస్కరించవలెను.)
దీపం దర్శయామి.  ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి.  నైవేద్యం సమర్పయామి.
(బెల్లముపై నీరు చల్లి, చుట్టూ నీరు వేసి క్రింది విధముగా చదివి నివేదనము చేయవలెను.)
ఓం భూర్భువస్సువ:  తత్సవితుర్వరేణ్యం  భర్గో దేవస్యధీమహి ధియోయోన: ప్రచోదయాత్, సత్యంత్వర్తేన పరిషించామి.
శ్రీ మహాగణాధిపతయే నమ: అవసరార్ధం గుడోపహారం నివేదయామి అమృతమస్తు  అమృతోపస్తరణమసి  ఓం ప్రాణాయ స్వాహా,  ఓం అపానాయ స్వాహా,  ఓం
ఓం వ్యానాయ స్వాహా,  ఓం ఉదానాయ స్వాహా,  ఓం సమానాయ స్వాహా (క్రిందివిధముగా చదివి కలశములోని నీరు వదలవలెను.) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.  ఉత్తరాపోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం  సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమ: తాంబూలం సమర్పయామి.
(కర్పూరం వెలిగించి గంట మ్రోగించుచూ క్రింది విధముగా చదివి హారతి యివ్వవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమ: ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి
సమ్రాజంచ విరాజంచాభి శ్రీర్యాచనోగృహే లక్ష్మీ రాష్ట్ర స్యయాముఖే తయామాసగ్ం సృజామసి సంతత  శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు, శ్రీ మహాగణాధిపతయే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ద ఆచమనీయమ్ సమర్పయామి.(పళ్ళెములో నీరు వదలి హారతి కళ్ళకు అద్దుకొనవలెను.తరువాత క్రిందివిధముగా ఉపచారములు చెబుతూ అక్షతలు సమర్పించవలెను.)
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ్ నమస్కారాన్ సమర్పయామి.  గణాధిపతి స్సుప్రీత స్సుప్రసన్నో వరదో బవతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి.  (పూజ చేసిన అక్షతలు, పుష్పములు శిరస్సున ధరించవలెను.)
శ్లో: ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజావిధిం నజానామి క్షమస్వ గణనాయక.
ఉద్వాసన:
మం: యజ్ణేన యజ్ణ మయజంత దేవా: తాని ధర్మాణి ప్రధమాన్యాసన్, తేహనాకం మహిమానస్సచంతే, యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవా:
శ్రీ మహాగణాధిపతిం యధాస్థానముద్వాసయామి. శోభనార్ధం పునరాగమనాయచ.
(గణపతిని తమలపాకుతో తీసి పూజామందిరంలో ఈశాన్యభాగంలో ఉంచవలెను.)
  (పసుపు గణపతి పూజ సమాప్తం)
      హరి: ఓం తత్సత్.

 శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము

 
 పాలవెల్లిని పండ్లు, పుష్పములు, మామిడి ఆకులు మొదలగు వాటితో అందముగా అలంకరింవి దేవుని మందిరముపై వ్రేలాడదీసి, ఆ పాలవెల్లి క్రింద కర్ర చెక్కను గాని, పీటను గాని పసుపు పూసి, కుంకుమ, వరిపిండి మొదలగువానితో అలంకరింవిఉంచుదురు.  ఆపీటపై ఒక తమలపాకును కొన తూర్పువైపు ఉండునట్లు పెట్టి దానిపై వినాయకప్రతిమను ఉంచవలెను.
శ్లో: ఓం శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ
ఆచమనం: ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయ స్వాహా,  ఓం మాధవాయ స్వాహా,ఓం గోవిందాయ నమ: 
విష్ణో, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుతజనార్దన, ఉపేంద్ర, హరే, శ్రీ కృష్ణాయ నమ:
భూతోఛ్ఛాటన:
శ్లో: ఉత్తిష్టంతు భూతవిశాచా: ఏతే భూమిభారకా: ఏతేషామవిరోధేన, బ్రహ్మకర్మ సమారధే.
ప్రాణాయామము:
మం: ఓం భూ:,  ఓంభువ:,  ఓగ్ం సువ:,  ఓం మహ:,  ఓంజన:  ఓంతప:,  ఓగ్ం సత్యం, ఓంతత్సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యోన: ప్రచోదయాత్, ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం.
సంకల్పము:
మమ ఉపాత్తదుతితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే,మేరోర్దక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్యప్రదేశే,
గంగా గోదావర్యోర్మధ్యదేశే, శోభనగృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సరే, దక్షిణాయనే, భాద్రపదమాసే, శుక్లపక్షే, చతుర్ధ్యాం ——–వాసరే,శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిదౌ శ్రీమాన్ ——–గోత్ర:ధర్మపత్నీ సమేతస్య,  అస్మాకం సహకుటుంబానాం క్షేమ,స్థైర్య,ధైర్య,విజయ,అభయ,ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధసిద్ధ్యర్ధం,
పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం, సకల కార్వేషు సర్వదాదిగ్వజయ సిద్ధ్యర్ధం, ఇష్టకామ్యార్ధ ఫలసిద్ధ్యర్ధం,వర్షే వర్షే ప్రయుక్త స్రీ వరసిద్ది వినాయక దేవతాముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయకదేవతాప్రీత్యర్ధం, సంభవద్భి: అంకై, సంభవద్భి:ఉపచారై:,సంభవతానియమేన, పురుషసూక్త విధానేన, కల్పోక్తప్రకారేణ, ధ్యాన ఆవాహనాది  షోడచోపచార పూజాం కరిష్యే. (నీరు ముట్టుకొనవలెను.)
వరసిద్ధి వినాయక ప్రతిమాశోధనం కరిష్యే:
(వినాయక ప్రతిమను పంచామృతములచే శుద్ధి చేయవలెను.  పంచామృతములు అంటే ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపిన నీరు. వీనిలో ఒక్కొక్క ద్రవ్యముతో ప్రతిమను శుద్ధి చేయుచూ చదువ వలసిన మంత్రములు ఇవ్వబడినవి.  మంత్రము చదువుచు కొంచెము కొంచెముగా పంచామృతములు పుష్పముతో ప్రతిమపై చల్లవలెను.  పంచామృతములు లభింపనిచో కొబ్బరినీటితో ప్రతిమా శోధనం చేయవచ్చును.)
పాలు:  మం:  ఆప్యాయస్వసమేతుతే, విశ్వత స్సోమవృష్ణియం, భవా వాజస్య సంగధే
పెరుగు:  మం:  దధిక్రావ్ణ్ణోఅకారిషం, జిష్ణోరశ్వస్యవాజిన:, సురభినోముఖాకరత్, ప్రణ ఆయుగ్ంషితారిషత్
నెయ్యి:  మం:   శుక్రమసి జ్యోతిరసి తేజోపిదేవోవస్సవితోత్పునాత్వచ్ఛిధ్రేణ వసోస్సూర్యస్య రశ్మిభి:,
తేనె:    మం:   మధు వతఋతాయతే, మధుక్షరంతి సింధవ: మాధ్వీర్నస్సంత్వోషధీ:, మధుసక్తముతో షసి, మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్య:, మాధ్వీర్గావో భవంతున:
పంచదార: మం: స్వాదు: పవస్వ దివ్యాయ జన్మనే, స్వాదురింద్రాయసుహ వేతునామ్నే, స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే, బృహస్పతయే మధుమాగ్ం అదాభ్య:
ఉదకము: మం:  ఆపోహిష్టామయోభువ: తానఊర్జేదధాతన, మహేరణాయ చక్షసే, యోవశ్శివతమోరస: తస్యభాజయతే హన:, ఉశతీరివ మాతర:, తస్మా అరంగ మామవ: యస్యక్షయాయ జిన్వధ, ఆపోజనయధాచన:     
   ప్రాణప్రతిష్ట: (పుష్పములు, అక్షతలు తీసుకొని నమస్కరించి ఈ విధముగా చదువ వలెను.)
మం:   తత్పురుషాయ విద్మ్హహే మహాదేవాయ ధీమహి, తన్నో దంతి: ప్రచోదయాత్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక మావాహయామి స్థాపయామి పూజయామి      
  (పుష్పములు , అక్షతలు వినాయకునిపై ఉంచవలెను. తరువాత పుష్పమతో వినాయకువి తాకుతూ ఈ క్రింది విధముగాచదివి, పుష్పమును వినాయకుని వద్ద ఉంచవలెను.)
మం:  అసునీతే పునరస్మాను చక్షు: పున: ప్రాణమిహనోధేహి భోగం, జ్యోక్పశ్యేమ సూర్య మచ్చరంత, మనుమతేమృడయాన స్స్వస్తి, అమృతం వై ప్రాణా:, అమృతమాప: ప్రాణానేవ ధాస్థానముపహ్వయతే. శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు.


 ధ్యానం:  (పుష్పములు, అక్షతలు తీసుకొని నమస్కరించి ఈ క్రింది విధముగా చదివి వినాయకునిపై ఉంచవలెను.)
శ్లో:  
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం, విఘ్నరాజ మహం భజే.
ఏకదంతం శూర్పకర్ణం, గజవక్త్రం చతుర్భుజం –  పాశాంకుశధరం దేవం, ద్యాయేత్సిద్ధి వినాయకం.
 ఉత్తమం గణనాధస్య వ్రతం సంపత్కరం శుభం  –  భక్తాభీష్టప్రదంతస్మాత్, ధ్యాయేత్తం విఘ్ననాయకం.
 ధ్యాయేద్గజాననం దేవం, తప్తకాంచన సన్నిభం –  చతుర్భుజం మహాకాయం, సర్వాభరణ భూషితం.
    శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: ధ్యాయామి ధ్యానం సమర్పయామి  
ఆవాహనం:  మం:  సహస్రశీర్షా పురుష:, సహస్రాక్ష స్సహస్రపాత్,సభూమిం విశ్వతో వృత్వా, అత్యతిష్టద్దశాంగులం.
శ్లో:  అత్రాగఛ్ఛ జగద్వంద్య, సుర రాజార్చితేశ్వర, అనాధ నాధసర్వజ్ఞ, గౌరీ గర్భ సముద్భవ.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: ఆవాహయామి.
రత్నసింహాసనం: (పుష్పములు, అక్షతలు తీసుకొని నమస్కరించి ఈ విధముగా చదివి వినాయకునికి సమర్పింవవలెను.)
మం:  పురుష వేదగ్ం సర్వం, యద్భూతం యచ్చభవ్యం, ఉతామృతత్వ శ్యేశాన: యదన్నే నాతి రోహతి 
శ్లో:  మౌక్తికై: పుష్యరాగైశ్చ, నానారత్న విరాజితం రత్నసింహసనం చారు, ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతాం.
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: రత్నసింహాసనం సమర్పయామి.
పాద్యం:
మం:  ఏతావానశ్యమహిమా, అతోజ్యాయాగ్ శ్చపూరుష: పాదోస్యవిశ్వాభూతాని, త్రిపాదస్యామృతం దివి.
శ్లో: గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక, భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన.
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: పాదయో పాద్యం సమర్పయామి. (పుష్పముతో వినాయకుని పాదములపై నీరు చల్లవలెను.)
అర్ఘ్యం:
మం:  త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుష:,పాదోస్యేహాభవాత్పున:  తదోవిష్వజగ్వ్యక్రామత్, సాశనానశనే అభి
శ్లో:  గౌరీపుత్ర నమస్తేస్తు, శంకరప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం, గధపుష్పాక్ష తైర్యుతం
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: హస్తయో: అర్ఘ్యం సమర్పయామి. (నీరు విడువవలెను.)
ఆచమనీయం:
మం:  తస్మా ద్విరాడజాయత, విరాజో అధిపూరుష: సజాతో అత్యరివ్యత, పశ్చాద్భూమి మధోపుర:
శ్లో:  అనాధ నాధ సర్వజ్ఞ, గీర్వాణ పరిపూజిత, గృహాణాచమనందేవ, తుభ్యం దత్తంమయాప్రభో
శ్లో:  శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమ: ముఖే ఆచమనీయం సమర్పయామి. ( వినాయకునిపై పుష్పముతో నీరు చల్లవలెను.)
పంచామృత స్నానం:
(క్రింది విధముగా చదువుచూ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార నీరు పుష్పముతో వినాయకునిపై చల్లవలెను):
మం: యత్పురుషేణ హవిషా, దేవాయజ్ఞ మతన్వత
       వసన్తో అస్యాసి దాజ్యం, గ్రీష్మ ఇధ్శశ్శ్రరద్ధివి: 
శ్లో:
దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం
మధుపర్కం గ్రహణేదం గజవక్ర్త నమోస్తుతే
స్నానం పంచామృతైర్ధేవ గృహణ గణనాయక
 పయోదధి ఘృతైర్యుక్తం శర్కరామధు సంయుతం
శ్రీ వరసిద్ది వినాయకస్వామినే నమ:
పంచామృత స్నానం సమర్పయామి.
శుద్దోదక స్నానం:
శ్లో: గంగాది సర్వతీర్ధేభ్య: అమృతైరమలైర్జలై:
     స్నానం కురిష్య భగవాన్నమ పుత్ర నమోస్తుతే :
శ్రీ వరసిద్ది వినాయకస్వామినే నమ:
శుద్దోదక స్నానం: సమర్పయామి.( పుషముతో నీరు వినాయకుని పపై చల్లవలెను)
వస్రం
మం: సప్తాస్యాసన్ పరిధయ: త్రిస్సప్త సమధ: క్రతా:
       దేవాయద్య్హజ్ఞం తన్వానా: అబధ్యన్ పురుషపశుం
శ్లో: రక్తవస్ర్తద్వయంచారు దేవయేగ్యం చ మంగళం
    శుభప్రధం గృహాణత్వం లంబోదర హరాత్మజ
శ్రీ వరసిద్ది వినాయక స్వామినే నమ: వస్ర్తయుగ్మం సమర్పయామి.( పత్తిని ఉండలుగాచేసి తడిపి పసుపు అద్ది వస్ర్తముగా సమర్పించుట ఆచారము. అట్టివి 2 వస్ర్తములు సమర్పించవలెను).
యజ్ఞోపవీతము
మం: తంయజ్ఞం బర్హిప్రౌక్షన్ పురుషం జాతమగ్రత:
       తేన దేవాఅయజంత సాధాఋషయశ్చయే
శ్లొ:  రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనంచోత్తరీయకం
      గృహాణ సర్వధర్మజ్ఞభక్తానామిష్టదాయకం
శ్రీ వరసిద్ది వినాయక స్వామినే నమ:యజ్ఞోపవీతము సమర్పయామి ( ప్రత్తిని చేతితో కోంచెము మేర నూలువలె తీసి అక్కడ పసుపు అద్ది యజ్ఞోపవీతముగా సమర్పించవలెను).
గంధం:
మం: తస్మాద్యజ్ఞాత్సర్వహుత:సంభృతం పృషదాజ్యం
       పశూగౌస్తాగౌశ్చత్రేవాయవ్యాన్, ఆరణ్యాన్ గ్రామశ్చయే
శ్లో:  చందనాగరు కర్పూరకస్తూరీ కుంకుమాన్వితం
     విలేపనం సుర శ్రేష్ట ప్రీత్యర్దం ప్రతిగుహ్యతం
శ్రీ వరసిద్దివినాయక స్వామినే నమ: దివ్యశ్రీ చందనం సమర్పయామి.( వినాయకునికి గంధము ఉంగరపు వ్రేలితో సమర్పించవలెను.)
ఆభరణం:
మం: తస్మాద్యజ్ఞాత్సర్వహుత: ఋచస్సామానీజిజ్ఞిరే
       ఛందాగం సి జిజ్ఞిరేతస్సాత్ యజుస్తస్మాదజాయతే
శ్లో: అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్
    శుభాన్, గృహాణ పరమానంద ఈశుపుత్రనమోస్తుతే
శ్రీ వరసిద్దివినాయక స్వామినే నమ:  అలంకరణార్దాం అక్షతాన్ సమర్పయామి.   (అలంకరణార్దాం అక్షతలు సమర్పింపవలెను)
పుష్పాణి:
మం: తస్మాదశ్వాఅజాయంత ఏక్ చోభయాదత:
       గావోహా జిజ్ఞిరే తస్మాత్, తస్మాజ్జాతా అజావయ:
శ్లో: సుగంధాణి సుపుస్పాణిజాజీకుందముఖానిచ
     ఏకవింశతి పత్రాణిసంగృహాణ నమోస్తుతే
శ్రీ వరసిద్దివినాయక స్వామినే నమ: పుష్పాణి పూజయామి ( వినాయకునికి పుష్పములు సమర్పింపవలెను)
అధాంగపూజ: (ఇక్కడ వినాయకుని ప్రతి అంగమును పుష్పములచే పూజించవలెను.)
 ఓం గణేశాయనమ: పాదౌ పూజయామి.(పాదములు)
 ఓం ఏకదంతాయనమ: గుల్ఫౌ పూజయామి. (చీలమండలు)
 ఓం శూర్పకర్ణాయనమ: జానునీ పూజయామి. (మోకాళ్ళు)
 ఓం విఘ్నరాజాయనమ: జంఘే పూజయామి. (పిక్కలు)
ఓం అఖువాహనాయనమ: ఊరూ పూజయామి. (తొడలు)
ఓం హేరంబాయనమ:  కటిం పూజయామి. (మొల)
ఓం లంబోదరాయనమ: ఉదరం పూజయామి. (కడుపు)
ఓం గణనాధాయనమ: నాభిం పూజయామి. (బొడ్డు)
ఓం గణేశాయనమ: హృదయం పూజయామి. (వక్షము)
ఓం స్థూలకంటాయనమ: కంటం పూజయామి.(కంటం)
ఓం స్కందాగ్రజాయనమ: స్కందౌ పూజయామి.(భుజములు)
ఓం పాశహస్తాయనమ: హస్తౌ పూజయామి.(చేతులు)
ఓం గజవక్త్రాయనమ: వక్త్రం పూజయామి.(నోరు)
ఓం విఘ్నహంత్రేనమ: నేత్రం పూజయామి. (కండ్లు)
ఓం శూర్పకర్ణాయనమ: కర్ణౌ పూజయామి. (చెవులు)
ఓం ఫాలచంద్రాయనమ: లలాటం పూజయామి. (నుదురు)
ఓం సర్వేశ్వరాయనమ: శిర: పూజయామి. (శిరస్సు)
ఓం విఘ్నరాజాయనమ: సర్వాంగాని పూజయామి.
ఏకవింశతి పూజ:  (వినాయకుని 21 రకముల పత్రములచే (ఆకులచే) పూజింపవలెను. సంస్కృతపదము పక్కనే ఆపత్రము యొక్క తెలుగు పేరు కూడ యివ్వడమైనది.
ఇందులో కొన్ని పత్రములు సాధారణంగా పూజకు వాడనివి. కాని వినాయకచవితి రోజున అవి వాడుటకు అనుమతించబడియున్నది.)

  శ్రీ విఘ్నేశ్వర అష్టోతర శతనామావళి :

ఓం వినాయకాయ నమ: 
ఓం గ్రహపతయే నమ : 
 ఓం అగ్రగణ్యాయ నమ:
ఓం విఘ్నరాజాయ నమ :
ఓం కామొనే నమ: 
ఓం గ్రామణ్యై నమ: 
ఓం గౌరీపుత్రాయ నమ :
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ: 
 ఓం గణపాయనమ:
ఓం గణేశ్వరాయ నమ:
ఓం పాశాంకుశధరాయ నమ: 
ఓం స్దిరాయ నమ: 
ఓం స్కందాగ్రజాయ నమ:
ఓం చండాయ నమ: 
ఓం వృద్ధిదాయ నమ: 
ఓం అవ్యయాయ నమ:
ఓం గుణాతీతాయ నమ: 
ఓం సుభగాయ నమ: 
ఓం పూతాయ నమ:
ఓం నిరంజానాయ నమ: 
ఓం శూరయ నమ: 
ఓం దక్షాధక్షాయ నమ:
ఓం అకల్మషాయ నమ: 
ఓం వాగీశాయ నమ: 
ఓం ద్విజప్రియాయ నమ:
ఓం స్వయంసిద్దాయ నమ: 
ఓం సిద్ధిదాయ నమ: 
ఓం అగ్నిగర్వభిదే నమ:
ఓం సిద్దార్చితవదాంబుజాయ నమ: 
ఓం దూర్వాబిల్వప్రియాయ నమ్: 
ఓం ఇంద్రశ్రీప్రదాయ నమ:
ఓం బీజాపూరకాయ నమ: 
ఓం కాంతాయ నమ: 
ఓం వాళబలప్రియాయ నమ:
ఓం అవ్యక్తాయ నమ: 
 ఓం పాపహారిణేనమ:
ఓం సర్వసిద్దప్రదాయకాయ నమ:
ఓం వరదాయ నమ: 
 ఓం కృతామాయ నమ:
ఓం శర్వతనయాయ నమ:
ఓం శాశ్వతాయ నమ:   :       
ఓం సమహితాయ నమ: 
ఓం శర్వప్రియాయ నమ:
ఓం కృతినే నమ: 
ఓం వకృతుండాయ నమ: 
ఓం సర్వాత్మకాయ నమ:
ఓం విద్వత్రియాయ నమ: 
ఓం శ్రీప్రదాయ నమ: 
ఓం సృష్టికర్ర్తేనమ:
ఓం వీతభయాయ నమ: 
ఓం సౌమ్యాయ నమ: 
ఓం దేవానీకార్చితాయ నమ:
ఓం గణనే నమ: 
ఓం భక్తకాంక్షితాదాయినే నమ: 
ఓం శివాయ నమ :
ఓం చక్రిణే నమ: 
 ఓం అచ్యుతాయ నమ:
ఓం శుద్దాయ నమ:
ఓం ఇక్షుచాపభ్రతే నమ: 
ఓం కేవలాయ నమ: 
ఓం బుద్దిప్రియాయ నమ:
ఓం అబ్జోత్పలకరాయ నమ: 
ఓం సిద్దాయ నమ: 
ఓం శాంతాయ నమ:
 ఓం శ్రీశాయ నమ:
ఓం జ్ఞానినే నమ: 
ఓం బ్రహ్మచారిణే నమ:
ఓం శ్రీపతయే నమ: 
ఓం మాయాయుక్తాయ నమ: 
ఓం గజాననాయ నమ:
 ఓం స్తుతిహర్షితాయ నమ:
 ఓం కాంతాయ నమ:
ఓం ద్త్వెమాతురాయ నమ:
ఓం కులాద్రిభృతే నమ: 
ఓం బ్రహ్మిష్ఠాయ నమ: 
ఓం మునిస్తుత్యాయ నమ:
ఓం జటినే నమ: 
ఓం భయవర్జితాయ నమ: 
ఓం భక్తవిఘ్నవినాశినే నమ:
ఓం చంద్రచూడాయ నమ: 
ఓం ప్రమత్తదైత్యభయాయ నమ: 
ఓం ఏకదంతాయ నమ:
ఓం అమరేశ్వరాయ నమ: 
ఓం వ్యక్తమూర్తయే నమ:   100 
ఓం చతుర్బాహవే నమ:
ఓం నాగయజ్ణోపవీతినే నమ: 
ఓం అమూర్తకాయ నమ: 
ఓం శక్తిసంయుతాయ నమ:
ఓం శ్రీకంఠాయ నమ:
ఓం పార్వతీశంకరోత్చంగఖేల నమ: 
ఓం చతురాయి నమ:
ఓం వ్రతినే నమ: 
 ఓం నోత్చవలాలనాయ నమ:
ఓం లంబోదరాయ నమ:
ఓం మూలకంఠాయ నమ: 
ఓం సమస్త జగదాధారయ నమ: 
ఓం శూర్పకర్ణాయ నమ:
ఓం త్రయికర్ర్తే నమ: 
 ఓం వరమూషకవాహనాయ నమ:
ఓం హేరంబాయ నమ:
 ఓం సామఘెషప్రియాయ నమ:
ఓం హృష్టస్తుతాయ నమ: 
ఓం బహ్మవత్తమాయ నమ:
ఓం పురుషోత్తమాయ నమ: 
 ఓం సర్వ సిద్ది ప్రదాయ కాయ నమ:
ఓం కాలయ నమ:
ఓం స్ధూలతుండాయ నమ: 
ఓం సిద్దలక్ష్మి గణపతయే నమ: 


No comments:

Post a Comment