Thursday, 24 August 2017

How to Imrove the north in a house construction?\ Vastu remedies for north in Telugu

shri lakshmi Ganesh image


While constructing a house  the north should be opened since to raise inflow of wealth, health and success. As per Vastu shastra North and East directions are perfectly connected with celestial bodies. Any construction should be done as per vastu in north because any flaw construction can lead to many problems like outflow than income, women troubles and success of resident.

ఉత్తర దిక్కుని ఏవిధంగా సమృద్ధి పరచాలి ?

గృహ నిర్మాణ సమయంలో వాస్తు చూపించటం పరిపాటి. ఇంకా గృహ నిర్మాణ సమయంలో తూర్పు, ఉత్తర దిక్కులు చాలా ముఖ్య పాత్రని కూడా వహిస్తాయి. ఏ దిక్కులో ఏది ఉంచితే మంచిది, ఏది ఉంచకూడదు  అని ఆలోచిస్తాం. ఉత్తర దిక్కున పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఉత్తర దిక్కుకి అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ గణపతి, శ్రీ మహా లక్ష్మి, శ్రీ కుబేరుని ఉంచినట్లయితే  ఇంట్లో నకారాత్మక శక్తి అనేది అస్సలు ఉండదు. ఉత్తర దిక్కుని ఎల్లప్పుడూ శుచి గా శుభ్రంగా ఉంచాలి. అప్పుడే మహాలక్ష్మి ఆగమనం జరుగుతుంది. మహాలక్ష్మి ఆగమనం అంటే ధనధాన్యాలకు లోటు ఉండ దన్నమాట. శ్రీ లక్ష్మి ఎక్కడ ఉంటె అక్కడే శ్రీ కుబేరుడు కుడా ఉంటాడు. అయితే డబ్బుని ఖర్చు పెట్టడానికి బుద్ధి కావాలి. ఆ బుద్ధిని ఇచ్చేది శ్రీ గణపతి. మన కోశాగారం నిండుగా ఉండాలన్నా, వంశ వృద్ధి జరగాలన్నా, పిల్లలు మంచి సంస్కార వంతులు కావాలన్నాఉత్తర దిక్కు సకారాత్మకతని కలిగి ఉండాలి. ఉత్తర దిక్కు పల్లంగా ఉండి దక్షిణ స్థానం ఎత్తుగా ఉండాలి. ఉత్తర దిక్కు ఎత్తుగా ఉన్నా \ మూసి వేసినా  కుటుంబంలో ఉన్నతి పడి పోతుంది. ఆ ఇంట్లో వారు దారిద్ర్యంతో బాధ పడతారు. దుఃఖం చోటు చేసుకుంటుంది. తగువులకి నిలయమవుతుంది. పిల్లల అభివృద్ధి తగ్గిపోతుంది.

ఉత్తర దిక్కుపాజిటివ్ గా ఉండాలి అంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.

ఉత్తర దిక్కుని వీలయినంత మటుకు ఓపెన్ గా ఉంచటం మంచిది. లక్ష్మీ , కుబేరులు, శ్రీ గణపతి స్థానమైనటువంటి ఉత్తర దిక్కు మీద భారీ నిర్మాణం ఏదయినా జరిగి నట్లయితే లక్ష్మి ఆగమనం జరుగదు.
ఉత్తర దిక్కు ఎప్పుడూ ఓపెన్ గా నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి. ఈ దిక్కులో జల నిర్మాణం అంటే బోరింగ్, కుళాయి ల నిర్మాణం జరగాలి. పూజ గది, పిల్లల గది, ధనం ఉంచడానికి ఉత్తర దిక్కు చాల మంచిది అంటే లాభకారి. పిల్లల చదువు ఉత్తర దిక్కుగా ఉండాలి. ఉత్తర దిక్కు ప్రవేశ ద్వారానికి శుభప్రదం . ఉత్తర దిక్కు కుబేరుని స్థానం. ఉత్తరాభిముఖ గృహం  సర్వ శ్రేస్టం ఈదిశ ప్రతినిధిత్వం స్వయంగా బుధుడు నిర్ణయిస్తాడు. కాల పురుషుని హృదయ స్థానం పైన ఈ దిశ అమలు జరుగుతుంది. ఉత్తర దిశ లో ఉన్న గృహానికి ఉత్తర దిశలోనే పూజ గది, పిల్లల గది, ధనం ఉంచడానికి ఉత్తర దిక్కు చాల మంచిది

ఉత్తర దిక్కున ఏమి ఉండకూడదో తెలుసుకుందాం.
ఉత్తర దిక్కున పొరపాటున కూడా వంట శాల ఉండకూడదు. ఉత్తర దిక్కు నీటికి సంబంధించినది నీరు కి అగ్నికి పొంతన లేదు.అలాంటి చోట అగ్ని ఉన్నట్లయితే ప్రమాదం జరుగుతుంది. ఉత్తర దిక్కున అశుభ్రం ఉండకూడదు. చాలా మంది ఉత్తర దిక్కులో బాత్రూమ్స్, మరుగు దొడ్డ్లు కడుతూ ఉంటారు. ఇది చాలా తప్పు.అలాగే స్టోర్ కూడా ఉండకూడదు. ఉత్తర దిశ లో ఉన్న గృహానికి ఉన్నటువంటి గోడవిరిగి పోవడం గానీ , పాడయి పోవడంగానీ జరిగినట్లయితే ఆ గృహంలో ఉన్నటువంటి వ్యక్తులకి మన స్సాంతి కరువయిపోతుంది. ఉత్తర దిక్కున వంటగదికి తగులుకొని బాత్రూం గానీ ఉన్నట్లయితే  ఆ ఇంట్లో స్త్రీలు ఎప్పుడూ తగువులతో చికాకు పెడుతూ ఉంటారు. వంట గది గానీ ఉత్తర దిక్కున ఉన్నట్లయితే ఆఇంట్లో తగువులు ఎక్కువగా అవుతాయి. పాత సామాన్లు అంటే పాత  టైల్స్, పాడయిపోయిన వస్తువులు  ఉన్నట్లయితే సంపద నష్టం అయ్యే అవకాసం  ఎక్కువ. జన్మ కుండలి లోని చతుర్ధ స్థానం ఉత్తర దిక్కుని నిర్దేశిస్తుంది. హృదయ స్థానం కాల పురుషుని నివాసం. ఉత్తర దిక్కులో వాస్తు దోషాలు ఉన్నట్లయితే గుండే కి  సంబంధించిన రోగాలు వస్తాయి.

ఉత్తర దిక్కు వాస్తు దోష ఉపాయాలు:-
ఉత్తర దిక్కుకి అధిపతి బుధుడు. ఈ దిశ లో ని  వాస్తు దోషాలు నిర్మూలించడానికి శ్రీ విఘ్నేస్వరుడిని ఆరాధించండి. గోసాలకి వెళ్లి గోమాతకి భోజన పానీయాలని సమర్పించాండి. ఉత్తర దిశ లో  సమృద్ధి పరచడానికి, మీ పరివారాన్ని సమృద్ధి పరచ డానికి ఒక జలా సయాన్ని నిర్మిచండి. దానిలో కమలాన్ని ఉంచండి. ఎక్కడయితే పద్మం ఉంటుందో అక్కడ లక్ష్మి వాసం జరుగుతుంది. ఎర్రటి పూలని ఉంచండి. ఆకుపచ్చని చెట్లని నాటండి. లైవ్ ప్లాంట్స్ నాటండి. ఇండో ర్ ప్లాంట్స్ ని పెట్టొద్దు. ఉత్తరదిక్కుని  శక్తివంతం చేయడానికి మీ పూజ గదిలో బుధ యంత్రాన్ని స్థాపించండి. ఉత్తరపు గోడలకి గ్రీన్ కలర్ పెయింట్ వాడండి. అలాగే కర్టెన్ కూడా డార్క్ గ్రీన్ కలర్ వాడండి. ఇంటి డోర్ బెల్ చిలుక చేసే సబ్ధం లాంటివి ఉంచండి. ఇంట్లో సంగీత ధ్వని నిచ్చే టటువంటి పెంద్యులం గడియారం  ఉంచండి. కుబేరు ని  యంత్రస్తాపన  చేసుకోవచ్చు. శివ కవచం చదవండి. వినాయకుడ్ని ఆరాధించండి. ఉత్తర గోడలకి పరుగెడుతున్న గుర్రాల చిత్రపటాల్ని ఉంచండి. 

వశీకరణ మంత్రాలకు మా యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్ర యిబ్ చేయండి.
  
మా యూట్యూబ్ ఛానెల్ Aastha Devotioanal

No comments:

Post a Comment